హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ ఉత్తర్వులకు విరుద్ధంగా టీచర్ల సర్దుబాటు చేపడుతున్నారని 2024- డీఎస్సీ ఉపాధ్యాయ సంఘం నేతలు ఆరోపించారు. ఇలా సర్దుబాటు చేయడం సరికాదని ఒక ప్రకటనలో అభిప్రాయపడ్డారు. నిబంధనల ప్రకారం ప్రాథమిక పాఠశాలల్లో 10 మంది విద్యార్థులుంటే ఒక టీచర్, 11 -60 మంది లోపు విద్యార్థులంటే ఇద్దరు టీచర్లు ఉండాలి.
కానీ కొన్ని జిల్లాల్లో 14,15 మంది విద్యార్థులుంటే ఒక టీచర్ను మరో స్కూల్కు బదిలీచేస్తున్నారని, ఇది నిబంధనలకు విరుద్ధమని సంఘం నేతలు రావుల రామ్మోహన్రెడ్డి, ఇర్ఫాన్, చంద్రశేఖర్రెడ్డి, రాము, కోటేశ్, పవన్, కావ్య, రమ్యశ్రీ, స్వప్న అభిప్రాయపడ్డారు. ఆదిలాబాద్ సహా పలు జిల్లాలో ఇలాగే చేశారని, ఇది నిబంధనలకు విరుద్ధమని మండిపడ్డారు.