సోమవారం 01 జూన్ 2020
Telangana - May 14, 2020 , 20:37:38

చిన్న తరహా పరిశ్రమలను ఆదుకోవాలి

చిన్న తరహా పరిశ్రమలను ఆదుకోవాలి

లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్న చిన్న తరహా పరిశ్రమలను ఆదుకోవాలని ఫెడరేషన్‌ ఆఫ్‌ తెలంగాణ స్మాల్‌ ఇండస్ట్రీస్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మన్‌ బోయినపల్లి వినోద్‌ కుమార్‌ను కోరారు. ఈ మేరకు బంజారాహిల్స్‌ లోని మినిస్టర్స్‌ క్వార్టర్స్‌ నివాసంలో వినోద్‌ కుమార్‌ ను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు.ఫిక్స్‌డ్‌ విద్యుత్‌ బిల్లులు మూడు నెలల పాటు మాఫీ చేయాలని, 6 నెలల ఆస్తి పన్నును మాఫీ చేయాలని, కార్మికులకు పారిశ్రామిక వాడల్లోనే వసతి సౌకర్యాలు కల్పించాలని వారు కోరారు. 

అలాగే బ్యాంకులలో పెండింగులో ఉన్న బ్రిడ్జి రుణాలను రిలీజ్‌ చేయించాలని, ఈఎస్‌ఐ ద్వారా కార్మికులకు యాభై శాతం నిధులను సమకూర్చాలని వారు వినోద్‌ కుమార్‌ను కోరారు. ఈ ప్రతినిధి బృందంలో సంఘం అధ్యక్షుడు కే.వీ రామేశ్వర్‌ రెడ్డి, ఉపాధ్యక్షుడు భాస్కర్‌ రెడ్డి, ప్రధాన కార్యదర్శి శివసాంబి రెడ్డి, జాయింట్‌ సెక్రటరీ అప్పిరెడ్డి, కోశాధికారి గోకుల్‌ శ్రీధర్‌, ఇతరులు ఉన్నారు.


logo