DSC | ఫలించనున్న 15 ఏండ్ల నిరీక్షణ.. త్వరలో 2008-డీఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగాలు?
2008-డీఎస్సీ అభ్యర్థులకు త్వరలో ఉ ద్యోగాలు ఇచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఈ అంశంపై పాఠశాల విద్యాశాఖ ఇ చ్చిన నివేదికపై ప్రభుత్వం పచ్చజెండా ఊపితే.. 1,200 మందికి ఉద్యోగాలు లభించే అవకాశాలు ఉన్నాయి.
- కోర్టు తీర్పు అమలుచేసే యోచనలో సర్కారు
- కొలిక్కివచ్చిన కసరత్తు..
DSC | హైదరాబాద్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ): 2008-డీఎస్సీ అభ్యర్థులకు త్వరలో ఉ ద్యోగాలు ఇచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఈ అంశంపై పాఠశాల విద్యాశాఖ ఇ చ్చిన నివేదికపై ప్రభుత్వం పచ్చజెండా ఊపితే.. 1,200 మందికి ఉద్యోగాలు లభించే అవకాశాలు ఉన్నాయి. రెగ్యులర్ ఉద్యోగాలిస్తారా? లేక మినిమం టైంస్కేల్ వర్తింపజేసి, కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలిస్తారా? అన్నది స్పష్టత రావాల్సి ఉన్నది. ఇది తేలిన తర్వాతే డీఎస్సీ నోటిఫికేషన్‌పై స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ట్రిబ్యునల్ తీర్పుతో
2008 డిసెంబర్ 6న ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం 35 వేల పోస్టులతో మెగా డీఎస్సీని ప్రకటించింది. ఎస్జీటీ పోస్టులను కామన్ మెరిట్ ప్రకారం భర్తీ చేస్తామని, వీటికి బీఈడీ, డీఈడీ అభ్యర్థులు అర్హులని పేర్కొన్నది. సుమారు 50 రోజుల తర్వాత ఎస్జీటీ పోస్టుల్లో 30 శాతం డీఈడీ అభ్యర్థులకు కేటాయిస్తూ 2009 జనవరి 29న జీవో-28ని తీసుకొచ్చింది. దీంతో బీఈడీ అభ్యర్థులు కోర్టుకు వెళ్లగా కామన్ మెరిట్ ప్రకారం భర్తీ చేయాలని కోర్టు తీర్పు ఇచ్చింది. ప్రభుత్వం నియమించిన క్యాబినెట్ సబ్‌కమిటీ సైతం కామన్ మెరిట్ ప్రకారం భర్తీ చేయాలని సూచించింది. దీంతో నోటిఫికేషన్ ప్రకారమే ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వం 2010 జూన్ 21న జీవో-27ను విడుదల చేసింది. దీని ప్రకారం అధికారులు నియామక కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభించారు. జిల్లాల వారీగా కామన్ మెరిట్ ప్రకారం ఎంపికైన అభ్యర్థుల జాబితాను అధికారులు ప్రకటించారు. 2009 జూన్ 27న కౌన్సిలింగ్ ప్రక్రియ కూడా మొదలైంది. డీఈడీ అభ్యర్థులు పరిపాలన ట్రిబ్యునల్‌ను ఆశ్రయించగా.. జూన్ 28న కౌన్సిలింగ్‌పై స్టే విధించింది. జీవో-28 ప్రకారం 30 శాతం కోటా కల్పిస్తూ కౌన్సిలింగ్ నిర్వహించాలని ట్రిబ్యునల్ ఆదేశించింది. ఆ తర్వాత 30 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ కొత్త మెరిట్ జాబితా విడుదల చేసి 2010లో ఉద్యోగాలు ఇచ్చారు. దీంతో మెరిట్ సాధించినా ఉద్యోగం రాక ఉమ్మడి రాష్ట్రంలో దాదాపు 3,500 మంది బీఈడీ అభ్యర్థుల కలలు కుప్పకూలాయి. ఇందులో తెలంగాణ అభ్యర్థులు 1,200 మంది వరకు ఉన్నారు.
కోర్టు తీర్పుతో ముందడుగు
బీఈడీ అభ్యర్థులకు అనుకూలంగా 2013 జూలై 15న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అయినా పలు కారణాలతో వీరికి ఉద్యోగాలివ్వలేదు. ఆ తర్వాత 2017 ఫిబ్రవరి 8న రాష్ట్ర హైకోర్టులో జస్టిస్ సంజయ్ కుమార్ నేతృత్వంలోని బెంచ్, 2022 సెప్టెంబర్ 27న హైకోర్టు ధర్మాసనం బీఈడీ అభ్యర్థులకు అనుకూలంగా తీర్పులు ఇచ్చాయి. పిటిషనర్లకు ఉద్యోగాలు ఇవ్వాలని ఆదేశించాయి. ఏపీలో దాదాపు రెండున్నరేండ్ల కింద డీఎస్సీ-2008 బాధితులకు కాంట్రాక్ట్ పద్ధతిలో అక్కడి ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఒకే నోటిఫికేషన్లో బాధితులు ఒక రాష్ట్రంలో ఉద్యోగాల్లో ఉండటం, ఒక రాష్ట్రంలో న్యాయం కోసం ఎదురుచూడటం సరికాదని ఈ నెల 8న రాష్ట్ర హైకోర్టు వ్యాఖ్యానించింది. డీఎస్సీ-2008 బాధితుల పట్ల సానుకూల నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వానికి సూచించింది. ప్రస్తుతం ఖాళీల్లో వారిని భర్తీ చేయాలని, కాంట్రాక్ట్ పద్ధతిలో అయినా ఉద్యోగాలు ఇవ్వాలని ఆదేశించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

