జగిత్యాల కలెక్టరేట్, డిసెంబర్ 23 : మల్లాపూర్ మండలం సిరిపూర్‌కు చెందిన గోగుల సాయికుమార్ మామిడికాయలు ఇస్తానని ఓ బాలుడికి ఆశచూపి గ్రామ శివారులోకి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు అప్పటి మల్లాపూర్ ఎస్సై పృథ్వీధర్ కేసు నమోదు చేయగా, అప్పటి మెట్‌పెల్లి సీఐ రవికుమార్.. నిందితుడు శ్యాంకుమార్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
నేరం రుజువు కావడంతో సాయికుమార్‌కు 20 ఏండ్ల శిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ ఫాస్ట్ ట్రాక్ కోర్టు జడ్జి నీలిమ సోమవారం తీర్పునిచ్చారు.