మనోహరాబాద్, జనవరి 27 : ట్రాన్స్ఫార్మర్ మంజూరు కోసం విద్యుత్తు శాఖ ఏఈ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఏసీబీ అధికారుల కథనం ప్రకారం.. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్లకల్‌లోని ఓ పరిశ్రమ నిర్వాహకుడు ఎల్టీ క్యాటగిరీ-3 కింద 63 కేవీ ట్రాన్స్ఫార్మర్ కోసం దరఖాస్తు పెట్టుకున్నాడు. ఇందుకోసం ఏఈ సీహెచ్ కృష్ణ రూ.30 వేలు లంచం డిమాండ్ చేశాడు. ముందుగా రూ.10 వేలు తీసుకున్నాడు. సదరు పరిశ్రమ యజమాని నుంచి సోమవారం మిగితా రూ.20 వేలను ఏఈ తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు ఏఈ కృష్ణను అదుపులోకి తీసుకున్నారు.