Fancy Numbers | హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): ఫ్యాన్సీ నంబర్ల బిడ్డింగ్‌లో భాగంగా ఆర్టీఏ ఖజానాలో సోమవారం రూ.47.12 లక్షల ఆదాయం చేరింది. ఖైతరాబాద్ ఆర్టీఏ కార్యాలయం నిర్వహించిన ఫ్యాన్సీ నంబర్ల వేలంలో టీజీ 09 బీ 9999 నంబర్‌ను రూ.20 లక్షలకు ఒక మొబైల్ కంపెనీ దక్కించుకున్నట్టు హైదరాబాద్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేశ్ తెలిపారు. టీజీ09సీ0001 నంబర్‌కు రూ.10.27 లక్షలు, టీజీ 09 ఈ 0007 నంబర్‌కు రూ.లక్ష పలికినట్టు వెల్లడించారు.