రుద్రూర్, మార్చి 14: దుండగులు ఏటీఎంను ధ్వంసం చేసి రూ.20 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా రుద్రూర్లో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకున్నది. రుద్రూర్లోని ఎస్బీఐ ఏటీఎం కేంద్రంలోకి చొర బడిన గుర్తుతెలియని వ్యక్తులు సీసీ కెమెరాల్లో రికార్డు కాకుండా బ్లాక్కలర్ పె యింట్ స్ప్రే చేశారు. అనంతరం ఏటీఎం ను ధ్వంసం చేసి నగదుతో ఉడాయించారు. చోరీ విషయం గురువారం ఉదయం వెలుగులోకి రావడంతో పోలీసులు ఏటీఎం దగ్గరికి చేరుకుని వివరాలు సేకరించారు. ఏటీఎంలో ఉన్న రూ.20 లక్షలు అపహరణకు గురైందని బ్యాంకు అధికారులు తెలిపారు.