హైదరాబాద్, జూలై17 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్టే బడ్జెట్లో దేశవ్యాప్తంగా బీసీల సంక్షేమం కోసం 2 లక్షల కోట్ల రూపాయల నిధులను కేటాయించాలని తెలంగాణ ఎంబీసీ సంఘాల సమితి రాష్ట్ర కోకన్వీనర్ కొండూరు సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ప్రధాని నరేంద్రమోదీకి ఆయన లేఖ రాశారు. బీసీలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలని, జనగణనలో కులగణన చేపట్టాలని ఆయన ఆ లేఖలో కొండూరు సత్యనారాయణ కోరారు.