హైదరాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ) : కళా ఉత్సవ్ జాతీయస్థాయి పోటీల్లో తెలంగాణ విద్యార్థిని పెండ్యాల లక్ష్మీప్రియ ప్రథమ బహుమతి గెలుచుకొన్నది. భువనేశ్వర్‌లోని రీజినల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ (ఆర్ఐఈ)లో శనివారం నిర్వహించిన కళా ఉత్సవ్ ముగింపు వేడుకల్లో శా స్త్రీయ నృత్యం (బాలికల విభాగం) పోటీల్లో లక్ష్మీప్రియ అద్భుత ప్రదర్శనను కనబరిచి విజేతగా నిలిచింది. కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రులు అన్నపూర్ణాదేవి, సుభాష్ సర్కార్ చేతులమీదుగా ఆమె బహుమతి అందుకొన్నది. లక్ష్మీప్రియ హనుమకొండ జిల్లా కాజీపేటలో మౌంట్‌ఫోర్ట్ హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్నది.