హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ) : మల్టీజోన్-1లో 19 మంది సివిల్ సీఐలను బదిలీ చేస్తూ.. వెయిటింగ్లో ఉన్న వారికి కొత్తగా పోస్టింగ్లు ఇస్తూ ఐజీ ఏవీ రంగనాథ్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. ఉత్తర్వులు తక్షణం అమల్లోకి వస్తాయని చెప్పారు.
ఏడుగురు సీఐలను నేరుగా ఐజీ ఆఫీస్లో రిపోర్టు చేయాలని ఆదేశించారు. వెయిటింగ్లో ఉన్న ఆరుగురికి పోస్టింగ్ ఇచ్చారు.