మల్టీజోన్ 1లో 19 మంది సివిల్ సీఐలను బదిలీ చేశారు. అలాగే వెయిటింగ్లో ఉన్న వారికి కొత్తగా పోస్టింగ్లు ఇచ్చారు. ఈ మేరకు ఐజీ ఏవీ రంగనాథ్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు తక్షణం అమల్లోకి వస్తాయని చెప్పారు. ఈ బదిలీల్లో ఏడుగురు సీఐలను నేరుగా ఐజీ ఆఫీస్లో రిపోర్టు చేయాలని ఆదేశించారు.
సత్తుపల్లి గ్రామీణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్. వెంకటేశం, ములుగు జిల్లాలో స్పెషల్ బ్రాంచ్లో విధులు నిర్వహిస్తున్న సీహెచ్ శ్రీధర్, మెదక్ పట్టణ, రూరల్ ఇన్స్పెక్టర్లు ఎస్. దిలీప్ కుమార్, బి. కేశవులు, భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ సీఐ బి. రాజేశ్వర్ రావు ను మల్టీ జోన్ 1 ఐజీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వెయిటింగ్లో ఉన్న ఆరుగురికి కొత్తగా పోస్టింగ్ ఇచ్చారు. అలాగే సంబంధిత యూనిట్ అధికారులు ఈ విషయంలో తదుపరి అవసరమైన చర్యలు తీసుకోవాలని, ఆయా ఇన్స్పెక్టర్ల రిపోర్టింగ్ తేదీని ఐజీ కార్యాలయానికి తెలియజేయాలని ఐజీ ఏవీ రంగనాథ్ ఆదేశించారు.