దేశంలో 17% మందికి కిడ్నీ సమస్యలు
దేశవ్యాప్తంగా కిడ్నీ వ్యాధిగ్రస్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నదని, ఏటా సుమారు 5 లక్షల మంది డయాలసిస్ రోగులుగా మారుతున్నారని పద్మభూషణ్, ప్రముఖ నెఫ్రాలజిస్టు డాక్టర్ ఎంకే మణి అన్నారు.
- ఏటా 5 లక్షల మందికి డయాలసిస్
- ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ ఎంకే మణి
- యశోద దవాఖానలో కిడ్నీ డోనర్లకు సత్కారం
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 4 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా కిడ్నీ వ్యాధిగ్రస్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నదని, ఏటా సుమారు 5 లక్షల మంది డయాలసిస్ రోగులుగా మారుతున్నారని పద్మభూషణ్, ప్రముఖ నెఫ్రాలజిస్టు డాక్టర్ ఎంకే మణి అన్నారు. అంతర్జాతీయ కిడ్నీ డే (వాస్తవానికి మే 9) ముందస్తు కార్యక్రమం శనివారం హైదరాబాద్ యశోద దవాఖానలో జరిగింది. ఈ సందర్భంగా 50 మందికిపైగా కిడ్నీ దాతలను ఘనంగా సత్కరించారు. డాక్టర్ ఎంకే మణి మాట్లాడుతూ దేశ జనాభాలో 17% మందికి దీర్ఘకాలిక కిడ్నీ సమస్యలు ఉన్నాయని, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు ఈ వ్యాధి బారిన పడ్డాయని పేర్కొన్నారు. యశోద హాస్పిటల్స్ కిడ్నీట్రాన్స్ప్లాంటేషన్ నిపుణుడు డాక్టర్ రాజశేఖర్ చక్రవర్తి మాట్లాడుతూ కిడ్నీ వ్యాధుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. డయాబెటిస్, హైబీపీతో బాధపడుతున్న వారు కిడ్నీల విషయంలో అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా ప్రాథమిక దశలో ప్రమాదకర వ్యాధులను గుర్తించవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జాకబ్ వర్గీస్, యశోద హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ పవన్ గోరుకంటి, నెఫ్రాలజిస్టులు, కిడ్నీ మార్పిడి నిపుణులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

