కురవి ;మహబూబాబాద్ జిల్లా కురవి ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో చదువుతున్న 17 మంది విద్యార్థినుల బర్త్డే ఒకే రోజు కావడం విశేషం. వీరిది జనవరి ఒకటిన పుట్టిన రోజు కావడంతో ఒక రోజు ముందుగా శనివారం వార్డెన్ పద్మ, సిబ్బంది చొరవ తీసుకొని సామూహికంగా కేక్ కట్ చేసి, శుభాకాంక్షలు తెలిపి బర్త్డే వేడుకలు జరిపారు.