సిద్దిపేట : సిద్దిపేట రూరల్ మండలం సీఎం కేసీఆర్ స్వగ్రామం చింతమడకలో 164 సామూహిక గృహా ప్రవేశాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు చేయించారు. ఈ డబుల్ బెడ్రూం ఇండ్లను ఎస్సీ లబ్దిదారులకు మంత్రి హరీశ్‌రావు అందజేశారు.
ముందుగా చింతమడక గ్రామంలో దమ్మ చెరువు నుంచి నర్లేoగడ్డ వరకూ బీటీ రోడ్డు, అలాగే చింతమడక నుంచి రాఘవాపూర్ వయా సింగ చెరువు వరకూ బీటీ రోడ్డు, చింతమడక నుంచి చెల్లాపూర్- రాజక్కపేట వరకూ బీటీ రోడ్డు పనులకు హరీశ్‌రావు శంకుస్థాపన చేశారు. గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. గ్రామ ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు అడుగడుగునా పూల వర్షం కురిపిస్తూ.. బాణాసంచా కాల్చి మంత్రి హరీశ్ రావుకు ఘన స్వాగతం పలికారు.