హైదరాబాద్, ఆగస్టు7 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వశాఖలు, ప్రభుత్వరంగ సంస్థల్లో 16 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని, వాటన్ని ంటినీ వెంటనే భర్తీ చేయాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్రంలోని 72 ప్రభుత్వ శాఖలు, 245 ప్రభుత్వరంగ సంస్థల్లోనే ఈ ఖాళీలు ఉన్నాయని ఉన్నాయని తెలిపారు. ప్రమోషన్లలో కూడా బీసీలకు రిజర్వేషన్లను అమలు చేయాలని, పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలని కోరా రు. ఢిల్లీలోని ఆంధ్రాభవన్ ఎదుట బీసీ ఉద్యోగులు, బీసీ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ధర్నానుద్దేశించి ఆర్ కృష్ణయ్య మాట్లాడారు. చట్టసభల్లో బీసీల రిజర్వేషన్ల బిల్లును ప్రవేశపెట్టే అంశంపై బీజేపీ తన విధాన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ధర్నాలో జాతీయ బీసీ సంక్షేమ సం ఘం ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం, భరత్‌కుమార్, మల్లేశ్, వెంకటేశ్,హనుమం త్, వేముల రామకృష్ణ, పద్మలత, వంశీకృష్ణ, సతీశ్, సురేశ్, ఉదయ్, మురళి, కిరణ్, రాఘవేంద్ర శివ, రాందేవ్, జయంతి పాల్గొన్నారు.