హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని 16 మంది అదనపు ఎస్పీలకు ఎస్పీలుగా పదోన్నతి, పోస్టింగ్ కల్పిస్తూ హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి రవిగుప్తా సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ఇదే ఉత్తర్వుల్లో ముగ్గురు డీసీపీలను బదిలీ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు.
అందులో ఒకరిని డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని పేర్కొన్నారు. ఇక ఏఆర్ వ్యవస్థలో కొత్తగా రూపొందించిన ఏడు పోస్టుల్లోని అడిషనల్ ఎస్పీలకు ఎస్పీ హోదా ఇస్తూ బదిలీ చేశారు.