తలసరిలేరు మీకెవ్వరు
తలసరి ఆదాయంలో రాష్ట్రం తాజాగా మరోసారి సత్తా చాటింది. గత ఆర్థిక సంవత్సరం (2022-23)లో తెలంగాణ రూ.3,08,732 (ప్రస్తుత ధరల ప్రకారం) ‘తలసిరి’తో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచినట్టు స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ శాఖ వెల్లడించింది. ఇది 2014-15లో రూ.1,24,104గా నమోదైన దానికంటే దాదాపు 150% అధికం.
- తెలంగాణకు కేంద్రం ప్రశంస
- 2014-15 కంటే 150% అధికం.. 15.1 శాతానికి వృద్ధిరేటు
- 2022-23లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.3,08,732
- కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు శాఖ వెల్లడి
- కేంద్రం పైసా ఇవ్వకున్నా స్వశక్తితో ఎదిగిన తెలంగాణ
హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): తలసరి ఆదాయంలో రాష్ట్రం తాజాగా మరోసారి సత్తా చాటింది. గత ఆర్థిక సంవత్సరం (2022-23)లో తెలంగాణ రూ.3,08,732 (ప్రస్తుత ధరల ప్రకారం) ‘తలసిరి’తో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచినట్టు స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ శాఖ వెల్లడించింది. ఇది 2014-15లో రూ.1,24,104గా నమోదైన దానికంటే దాదాపు 150% అధికం. ఇదే సమయంలో తెలంగాణ తలసరి ఆదాయ వృద్ధిరేటు 11 నుంచి 15.1 శాతానికి పెరిగింది. 2021-22లో తెలంగాణ
రూ.2,65,942 ‘తలసిరి’తో పెద్ద రాష్ర్టాల జాబితాలో మొదటి స్థానంలో నిలిచిన విషయం విదితమే.

దీనితో పోలిస్తే 2022-23లో రాష్ట్ర తలసరి ఆదాయం భారీగా పెరిగిందని చెప్పవచ్చు. 2020-21, 2021-22లో ఢిల్లీ తలసరి ఆదాయం వరుసగా రూ.3,31,112, రూ.3,89,529గా నమోదైంది. కానీ, 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఢిల్లీ తలసరి ఆదాయ వివరాలు అందుబాటులో లేవు. దీంతో ఈసారి తెలంగాణ తర్వాత కర్ణాటక రూ.3,01,673, హర్యానా రూ.2,96,685 ‘తలసిరి’తో వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచినట్టు స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ శాఖ తెలిపింది.

ఫైనాన్షియల్, రియల్ రంగాల జోరు
స్థూల విలువ జోడింపు (జీవీఏ)లో ఫైనాన్షియల్, రియల్ ఎస్టేట్, ప్రొఫెషనల్ సర్వీసెస్ రంగాలు అత్యధికంగా రాణించాయి. వాస్తవానికి 2021-22 ఆర్థిక సంవత్సరంలో నమోదైన మొత్తం జీఏవీలో 21.51 శాతంగా ఉన్న ఈ రంగాల వాటా గత ఆర్థిక సంవత్సరంలో 21.42 శాతానికి తగ్గింది. గత ఐదేండ్లుగా ఈ రంగాలు జీవీఏలో అత్యధికంగా 22.19% వాటాను కలిగివుండడం గమనార్హం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vote | నేను బతికే ఉన్నా.. 11 ఎన్నికల్లో ఓటు వేస్తే.. ఇప్పుడు నోటీసులు ఇస్తరా?.. ‘సర్’పై వృద్ధుడి నిరసన
TOMCOM | టామ్కామ్ టోపీ.. విదేశాల్లో ఉద్యోగాల పేరుతో మోసం
Thermal Plant | థర్మల్ ప్లాంట్లలో డేంజర్ బెల్స్.. తగ్గుతున్న బొగ్గు నిల్వలు.. ఇప్పుడున్నది 9 రోజుల నిల్వలే!
మహా కుంభకోణం వివేక గంగాధరం.. కార్మికశాఖ స్కామ్లో వేళ్లన్నీ మంత్రి వివేక్, బోర్డు సీఈవో గంగాధర్ వైపే
Horoscope | 17-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

