హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 6 ( నమస్తే తెలంగాణ): ఆకాశ్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ లిమిటెడ్ (ఏఈఎస్ఎల్) విద్యార్థులు నీట్ యూజీ-2024లో అత్యుత్తమ ఫలితా లు సాధించారని ఆ సంస్థ చీఫ్ అకడమిక్, బిజినెస్ హెడ్ ధీరజ్ కుమార్ మిశ్రా గురువా రం తెలిపారు. ఆలిండియా క్యాటగిరీలో హైదరాబాద్కు చెందిన 15 మంది విద్యార్థులలో అనురన్ ఘోష్ 77వ ర్యాంకు, సాయిప్రణవ్ లకినపల్లి 306, రిజ్వాన్ షేక్ 549, జయంత్ 755, అరూష్ 1391, కె.సర్వజ్ఞ 856 ర్యాం కులు సాధించారని ఆయన తెలిపారు. విద్యార్థులను నీట్ కోసం ఏఈఎస్ఎల్ అత్యుత్తమంగా సిద్ధం చేసిందని చెప్పారు. అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ఆయన అభినందించారు.