హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర బడ్జెట్లో వరుసగా ఐదేండ్లపాటు15% నిధులు కేటాయిస్తేనే బడులు బాగుపడతాయని తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి అభిప్రాయపడ్డారు. శనివారం ఆయన తెలంగాణ టీచర్స్ యూనియన్ (టీటీయూ) రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతూ.. బడుల బాగు కోసం ఉద్యమించాల్సిన తరుణం ఆసన్నమయ్యిందని పేర్కొన్నారు.
సమావేశంలో ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, టీటీయూ రాష్ట్ర అధ్యక్షుడు మణిపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి పీ ఆదర్శన్‌రెడ్డి, సలహాదారు ఏరుకొండ నర్సింహాస్వామి, రమేష్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.