మణికొండ, జూన్ 22 : మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని చిత్రపురికాలనీ వీధి కుక్కలు వీరంగం చేశాయి. ఎంఐజీ బ్లాక్-6లో నివాసముంటున్న తెలుగు సినిమా స్టంట్ మాస్టర్ బద్రి భార్య రాజేశ్వరి కాలనీలో మార్నింగ్ వాకింగ్‌కు బయలుదేరింది.
ఒంటరిగా వెళ్తున్న ఆమెపై ఒక్కసారిగా 15 కుక్కలు దాడి చేయగా ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. వాటిని ఆమె భర్త శనివారం సోషల్‌మీడియాలో పోస్టుచేశారు. ప్రభుత్వం స్పందించి అవసరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తిచేశారు.