వృద్ధాప్యం.. ఎవరికైనా అనివార్యం. అది కొందరికి శాపమై బాధిస్తుంది. తమను పట్టించుకొనేవారు లేక.. చూసే దిక్కులేక.. నిలువ నీడలేక.. కుటుంబసభ్యుల నుంచే వేధింపులు, ఛీత్కాలు భరిస్తూ కుమిలిపోతున్న అభాగ్యులెందరో. అలాంటివారిని అక్కున చేర్చుకొని, మానవీయ స్పర్శను, మీకు మేమున్నామన్న భరోసాను అందిస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. ఆసరా పెన్షన్లు, వృద్ధాశ్రమాలు, హెల్ప్‌లైన్, ప్రత్యేక వెబ్సైట్ ద్వారా లక్షలాది వృద్ధులకు అండగా నిలుస్తున్నది. వారికి గౌరవనీయమైన జీవితాన్ని అందించేందుకు కృషి చేస్తున్నది.
హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): వృద్ధుల సంక్షేమంలో తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది. ఆసరా పథకం ద్వారా దేశంలో ఎక్కడా లేనివిధంగా అత్యధిక మొత్తంలో రూ.2,016 పింఛన్‌ను అందిస్తున్నది. ఆర్థిక భరోసా కల్పిన్నది. సామాజికంగానూ అండగా నిలుస్తున్నది. దేశంలోనే తొలిసారిగా హెల్ప్‌లైన్ సేవలను ప్రారంభించి, సమర్థవంతంగా నిర్వహిస్తున్నది. వృద్ధులకు మరింత మెరుగైన సేవలను అందించే లక్ష్యంతో ప్రభుత్వం హెల్ప్‌లైన్ వెబ్సైట్ www.tsseniorcitizens. cgg. gov.inను సైతం అందుబాటులోకి తెచ్చింది. ప్రయోగాత్మకంగా జీహెచ్ఎంసీ పరిధిలో ఫిర్యాదులను స్వీకరిస్తున్నారు. త్వరలో రాష్ట్రమంతా విస్తరించనున్నారు.
వివిధ రకాల సమస్యల్లో ఉన్న వృద్ధులకు అవసరమైన సహాయ, సహకారాలు అందించి వారికి సంతోషకరమైన, ఆరోగ్యకరమైన జీవనాన్ని కల్పించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే మొదటిసారిగా హెల్ప్‌లైన్ 14567 సేవలను ప్రారంభించింది. టాటా ట్రస్ట్ సౌజన్యంతో 2019లో ఈ సేవలను తొలుత జీహెచ్ఎంసీ పరిధిలో ప్రయోగాత్మకంగా చేపట్టింది. దీనికి విశేష స్పందన రావడంతో 2020 అక్టోబర్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా విస్తరించింది. తెలంగాణ స్ఫూర్తితో కేంద్రం కూడా హెల్ప్‌లైన్‌ను దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు ముందుకొచ్చింది. 2021 అక్టోబర్ నుంచి 26 రాష్ర్టాల్లో అమలుచేస్తున్నారు. ఆయా రాష్ర్టాలు హెల్ప్‌లైన్ 14567 సేవలను స్వచ్ఛంద సంస్థలకు అప్పగించగా, తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా నిర్వహిస్తున్నది. ఇందుకోసం ఏటా రూ.70 లక్షల నుంచి 80 లక్షల వరకు వెచ్చిస్తున్నది. తెలంగాణలో అమలవుతున్న హెల్ప్‌లైన్ సేవలను మహిళా పార్లమెంటరీ కమిటీ సైతం ప్రత్యేకంగా ప్రశంసించడం విశేషం.
ఆసరా పింఛన్ల ద్వారా సీఎం కేసీఆర్ వృద్ధులకు అండగా నిలుస్తున్నారు. వృద్ధు లు ప్రశాంత, సంతోషకరమైన జీవనాన్ని గడిపేందుకు కావాల్సిన చర్యలు చేపడుతున్నారు. వృద్ధుల భద్రత, సంక్షేమం, హకుల పరిరక్షణకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నది. హెల్ప్‌లైన్ సేవలను వృద్ధులు సద్వినియోగం చేసుకోవాలి. వృద్ధులకు సమాజంలోని ప్రతి ఒక్కరూ అండగా నిలవాలి. హెల్ప్‌లైన్‌పై విస్తృత ప్రచారం కల్పించాలి.
– కొప్పుల ఈశ్వర్, వయోవృద్ధుల సంక్షేమశాఖ మంత్రి
వృద్ధుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. వృద్ధులు ఎవరి నుంచి, ఏవిధమైన వేధింపులను ఎదుర్కొంటున్నా, ఎలాంటి సమాచారం కోసమైనా హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలి. ప్రతి ఒక్కరూ వృద్ధులను ప్రేమతో చూడాలి. వృద్ధులను ఇబ్బంది పెడితే చట్టపరమైన చర్యలు తప్పవు. – శైలజ, వయోవృద్ధుల సంక్షేమశాఖ కమిషనర్
హెల్ప్‌లైన్ ద్వారా తెలంగాణ ప్రభుత్వం నాలుగు రకాలైన సేవలను అందిస్తున్నది.
హెల్ప్‌లైన్ 14567 సేవల కోసం రాష్ట్ర ప్రభుత్వం వయోవృద్ధులశాఖలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది.