అడవిలోకి మేతకు వెళ్లిన మూగజీవాలు జీవచ్ఛావాలుగా మారాయి. శరీర ఉష్ణోగ్రతలు తగ్గి 140 ఆవులు మృత్యువాతపడ్డాయి. మరో 89 ఆవుల ఆచూకీ దొరకడంలేదు. రాజన్నసిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం మద్దిమల్ల, రుద్రంగి మండలం దేగావత్తండాలో శుక్రవారం ఈ విషాద ఘటనలు వెలుగుచూశాయి. మద్దిమల్లతండాకు చెందిన 23 మంది రైతులకు చెందిన 129 ఆవులను మూడురోజుల క్రితం మేత కోసం సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. చీకటిపడ్డా తిరిగిరాకపోవడంతో రైతు లు ఆందోళ చెందారు.
విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో వాటి ఆచూకీ దొరకలేదు. గురువారం సా యంత్రం వర్షం తగ్గిన తర్వాత అడవిలోకి వెళ్లి చూడగా 80 ఆవులు చనిపోయి పడిఉన్నాయి. మ రో 49 ఆవుల కోసం గాలిస్తున్నారు. రుద్రంగి మం డలం దేగావత్తండా, కున్సోత్తండా, జోత్యతండాకు చెందిన 100 ఆవుల్లో 40 విగతజీవులుగా పడిఉన్నాయి. మరో 60 ఆవుల ఆచూకీ దొరకడం లేదు. శరీర ఉష్ణోగ్రతలు తగ్గడంతోనే ఆవులు మరణించాయని పశువైద్యాధికారులు పేర్కొన్నారు.