ఆలేరు టౌన్ , ఆగస్టు 24 : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు తహసీల్దార్ కార్యాలయంలో ఓ రైతు నుంచి 14 వేలు లంచం తీసుకుంటుండగా ఆర్ఐ, జీపీవోను నల్లగొండ ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నల్లగొండ ఏసీబీ డీఎస్పీ జగదీశ్ చందర్ వివరాల ప్రకారం.. ధర్మారెడ్డిగూడెం గ్రామానికి చెందిన బుడిగె ఉప్పలయ్య రెండెకరాల భూమిని 2023లో కొడుకు పేర గిఫ్ట్‌డీడ్ చేశారు.
అనంతరం కొడుకు పోషించడం లేదని గిఫ్ట్‌డీడ్ రద్దుకు తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేశాడు. 2025లో ఉప్పలయ్య మరణించాడు. కొడుకు మహేశ్ ఆ భూమిని అమ్మకానికి పెట్టి తహసీల్దార్ కార్యాలయంలో స్లాట్ బుక్ చేసుకున్నాడు. ఫైల్‌ను పరిశీలించేందుకు ఆర్ఐ, జీపీవో లంచం డిమాండ్ చేశారు. సోమవారం మహేశ్ రూ.14 వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు దాడులు చేసి జీపీవో షేక్ అహ్మద్‌తోపాటు ఆర్ఐ పూర్ణచందర్‌రావును అదుపులోకి తీసుకున్నారు.