హైదరాబాద్, అక్టోబరు 1 (నమస్తే తెలంగాణ) : యంగ్ ఇండియా పోలీస్ సూల్ (వైఐపీఎస్) నిర్మాణానికి కార్పొరేట్ సంస్థలు, దాతలు ముందుకు రావడం అభినందనీయమని డీజీపీ సీవీ ఆనంద్ అన్నారు. మంచిరేవులలోని వైఐపీఎస్ అకడమిక్ బ్లాక్ నిర్మాణానికి ఎంవైకే లాటిక్రెట్ (ఎంవైకే ఫౌండేషన్) రూ.2 కోట్ల సీఎస్ఆర్ ఫండ్‌ను విరాళంగా అందించింది. ఎంవైకే లాటిక్రెట్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, వైస్ చైర్మన్ మురళీ యాదవ్ గురువారం డీజీపీ కార్యాలయంలో సీవీ ఆనంద్‌కు చెకును అందజేశారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ పోలీసు సిబ్బంది పిల్లలతో పాటు సాధారణ ప్రజల పిల్లలకు నాణ్యమైన విద్య అందించడమే యంగ్ ఇండియా పోలీస్ సూల్ లక్ష్యమని తెలిపారు.