
మిర్యాలగూడ టౌన్: ముగ్గురు యవకులు కలిసి 14 కిలోల గంజాయిని ద్విచక్ర వాహనంపై అక్రమంగా తరలిస్తుండగా మిర్యాలగూడ రూరల్ పోలీ సులు పట్టుకున్నట్లు డీఎస్పీ వెంకటేశ్వర్రావు తెలిపారు. సోమవారం మిర్యాలగూడ డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.
మిర్యాలగూడ మండల పరిధి గూడూరు గ్రామ శివారులో అద్దంకి నార్కెట్‌పల్లి రహదారిపై రూరల్ సీఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో రాయల్ ఎన్ఫీల్డ్ వాహనంపై ముగ్గురు యువకులు వెళ్తుండగా పోలీసులు వాహానాన్ని ఆపి పరిశీలించగా తనికీ చేశారు. వాహనంపై ప్రత్యేకంగా తయారు చేసిన ప్యాకింగ్ కనపడటంతో విప్పి చూడగా గంజాయి ఉందని తెలిపారు.
గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన చల్లా రాహుల్‌రెడ్డి, పోచమల్ల సురేశ్, జాస్తి జీవన్‌కుమార్‌లు ముగ్గురు యువ కులని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా వివరాలు తెలిపారు. ఈ ముగ్గురు యువకులు భద్రాచలం సమీపం లోని సారపాక గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వద్ద 14 కిలోల గంజాయి కొని బైక్‌పై హైదరాబాద్‌కు తరలించి అక్కడ విక్రయిం చేందుకు వెళ్తూ పోలీసులకు పట్టుబడ్డారు.
ఈ విషయంపై లోతైన విచారణ జరిపేందుకు మిర్యాలగూడ రూరల్ సీఐ సత్యనారాయణను విచారణ అధికారిగా నియ మించినట్లు తెలిపారు. కాగా వీరి నుంచి రాయల్ ఎన్ఫీల్డ్ ద్విచక్ర వాహనం, 14 కిలోల గంజాయి, మూడు సెల్ఫోన్లు స్వాదీనం చేసుకుని ముగ్గురు వ్యక్తులని కోర్టులో హాజరు పరిచినట్లు డీఎస్పీ తెలిపారు. సమావేశంలో రూరల్ ఎస్సై సుధీర్, సిబ్బంది ఉన్నారు.