హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ): డీజీపీ అంజనీకుమార్ ఆదేశాల మేరకు ఆయా కమిషనరేట్ల సీపీలు, జిల్లాల ఎస్పీలు, ఇతర సిబ్బం ది తెలంగాణ వ్యాప్తంగా ఫిబ్రవరిలో 135 ఠాణాలు, 45 గ్రామాలను సందర్శించారు. ఇటీవల డీజీపీ వీడియో కాన్ఫరెన్స్లో నిర్వహించి, ఠాణాలు, సమస్యాత్మక ప్రాంతాలను సందర్శించాలని ఆదేశించారు. ఆ అధికారులకు డీజీపీ శుక్రవారం అభినందించారు.