హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా 13 మంది సివిల్ డీఎస్పీలకు అడిషనల్ ఎస్పీ(నాన్‌కేడర్)లుగా పదోన్నతులు కల్పిస్తూ సీఎస్ శాంతికుమార్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రమోషన్ పొందిన 13 మంది 15రోజుల్లోపు డీజీపీ ఆఫీసులో రిపోర్టు చేయాలని ఆదేశించారు. ఈ ఉత్తర్వులు తక్షణం అమల్లోకి వస్తాయని తెలిపారు. పదోన్నతి పొందిన వారిలో కే శంకర్(సీఐడీ), డీ ఉపేందర్(సీఐడీ), బీ ప్రతాప్‌కుమార్(విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్), బీ శ్రీకృష్ణగౌడ్(ఏసీబీ), జీ వెంకటేశ్వరబాబు(పీటీసీ అంబర్పేట్), జే నర్సయ్య(ఇంటెలిజెన్స్), ఎం పిచ్చయ్య(పీటీసీ అంబర్పేట్), ఏ విశ్వప్రసాద్(విజిలెన్స్), డీ కమలాకర్‌రెడ్డి(ఏసీబీ), బీ కిషన్(ఏసీపీ నిజామాబాద్ సీసీఎస్), ఎండీ మాజిద్(టీజీపీఏ), జీ బస్వారెడ్డి(ఏసీపీ ఆర్మూర్), కే పుల్లయ్య(ఏసీపీ సీఐసెల్ సైబరాబాద్) ఉన్నారు.