చిన్నగూడూరు (మరిపెడ) మే 21: మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఆనేపురం శివారు మేఘ్యాతండా, వెంకట్తండాల్లో వీధి కుక్కలు రెచ్చిపోయాయి. ఆదివారం వివిధ పనుల నిమిత్తం వెళ్తున్న 13 మందిపై దాడి చేసి గాయపరిచాయి. వీరిలో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. గాయపడిన వారు మహబూబాబాద్ జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖానకు వెళ్లి చికిత్స చేయించుకున్నారు.