హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ) : టీచర్స్ ఎక్స్పోజర్ విజిట్లో భాగంగా మరో 120 మంది సర్కార్ టీచర్లను విద్యాశాఖ విదేశీ పర్యటనలకు పంపించనున్నది. 40 మంది చొప్పున మరో మూడు బృందాలను విదేశీ పర్యటనలకు పంపించనున్నారు.
సింగపూర్, జపాన్, వియత్నాం దేశాలకు పంపించనున్నారు. ఇటీవలే 40 మంది టీచర్లను ఫిన్లాండ్కు పంపించారు. ఐదు రోజులపాటు 40 మంది టీచర్లు ఫిన్లాండ్లో పర్యటించి తిరిగి వచ్చారు.