హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు మరో 12 ఐపీఎస్ పోస్టులను కేటాయిస్తూ కేంద్ర హోంశాంఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రాష్ట్రంలోని ఐపీఎస్ క్యాడర్ సంఖ్యను 139 నుంచి 151కి పెంచుతూ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీవోపీటీ)నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రంలోని సీనియర్ డ్యూటీ పోస్టుల సంఖ్య 76 నుంచి 83కి పెరిగింది.
తెలంగాణకు రాష్ర్టానికి ఐపీఎస్‌ల సంఖ్య పెంచాలని తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పలుసార్లు కేంద్రానికి విజ్ఞాపనలు అందించారు. ఇదే క్రమంలో జిల్లాల పునర్విభజన తర్వాత రాష్ట్ర అవసరాలకు తగ్గట్టుగా ఐపీఎస్‌లను కేటాయించాలని లేఖలు రాశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 29 ఐపీఎస్ పోస్టులు కావాలని కోరగా 12 పోస్టులు కేటాయించారు.