శనివారం 04 ఏప్రిల్ 2020
Telangana - Mar 06, 2020 , 01:43:00

కేరళ వెళ్లిన రాష్ట్ర బృందం

కేరళ వెళ్లిన రాష్ట్ర బృందం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా వైరస్‌ నిరోధానికి కేరళ ప్రభుత్వం తీసుకొన్న చర్యల పై అధ్యయనం చేసేందుకు 12 మంది వైద్యనిపుణులు, అధికారుల బృందం గురువారం తిరువనంతపురం వెళ్లింది. బృందంలో జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్‌ సంతోష్‌, సీడీఎం ప్రతినిధి పంకజ, గ్రామీణాభివృద్ధిశాఖ డిప్యూ టీకమిషనర్‌ రవీందర్‌, రంగారెడ్డి డీపీవో పద్మ జ, విద్యాశాఖ ప్రతినిధి రమణకుమార్‌, ఆర్టీసీ ఈడీ యాదగిరి, గాంధీ, చెస్ట్‌  దవాఖానల సూపరింటెండెంట్లు శ్రవణ్‌కుమార్‌, మహబూబ్‌ఖాన్‌, డీఎంహెచ్‌వో వెంకట్‌, ఎస్టీఈఎంఐ పీవో రఘు, ఐడీఎఫ్సీ పీవో శివబాలాజీరెడ్డి, స్టేట్‌ప్రోగ్రాం ఆఫీసర్‌ సత్యం ఉన్నారు. 


పర్యవేక్షణ కమిటీలకు అధికారుల విభజన

కొవిడ్‌-19 నిరోధక చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఏర్పాటుచేసిన కమిటీలకు అధికారులను నియమించారు. రాష్ట్రస్థాయి పర్యవేక్షణ కమిటీకి చైర్మన్‌గా వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌, సభ్యులుగా వైద్య, ఆరోగ్యశాఖ స్పెషల్‌చీఫ్‌ సెక్రటరీ ఏ శాంతికుమారి, డబ్ల్యూహెచ్‌వో రాష్ట్ర కోఆర్డినేటర్‌ ఉం టారు. హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీలో హైదరాబాద్‌ కలెక్టర్‌ శ్వేతామహంతి, డీఎంఈ రమేశ్‌రెడ్డి, ఐపీఎం డైరెక్టర్‌ శంకర్‌, డీఎంఈ పరిధిలోని అధికారులు వాణి, విమల థామ స్‌, డీపీహెచ్‌ తరపున అనిత గ్రేస్‌ను నియమించారు.  సర్వేలెన్స్‌ కమిటీలో ప్రజారోగ్యశాఖ డైరెక్టర్‌ జీ శ్రీనివాస్‌రావు, హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల డీఎంహెచ్‌వోలు, జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్‌ బీ సంతోష్‌, డబ్ల్యూహెచ్‌వో ప్రతినిధులు ఇద్దరు ఉన్నారు. ఐఈసీ కమిటీలో ఎన్‌హెచ్‌ఎం నోడల్‌ అధికారి.. ఐఅండ్‌పీఆర్‌ శాఖ ప్రతినిధి ఉన్నారు. ప్రొక్యూర్‌మెంట్‌ కమిటీలో టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ఎండీ చంద్రశేఖర్‌రావు, టీసాక్స్‌ డైరెక్టర్‌ ప్రీతిమీనా ఉన్నారు. ట్రైనింగ్‌ అండ్‌ కెపాసిటీ బిల్డింగ్‌ కమిటీలో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌, ఫ్యామిలీ వెల్ఫేర్‌ (ఐఐహెచ్‌ఎఫ్‌డబ్ల్యూ) డైరెక్టర్‌ అలుగు వర్షిణి, డబ్ల్యూహెచ్‌వో ప్రతినిధులు ముగ్గురిని నిర్ణయించారు. 


హైదరాబాద్‌లో ఢిల్లీ బృందం

కొవిడ్‌-19ను ఎదుర్కొనేందుకు తెలంగాణ చేపట్టిన చర్యలను అంచనావేసేందుకు కేంద్ర బృందం హైదరాబాద్‌ వచ్చింది. ముందుగా శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో నిర్ధారణ పరీక్షల విధానాన్ని పరిశీలించింది. గాంధీ దవాఖాన ను సందర్శించింది. కోఠిలో ఏర్పాటుచేసిన కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రాన్ని పరిశీలించింది.


logo