అలంపూర్, జూన్ 17 : ఇథనాల్ కంపెనీకి వ్యతిరేకంగా పోరాడి జైలుకు వెళ్లిన 12మంది రైతులకు బెయిల్ మంజూరైంది. జోగుళాంబ గద్వాల జిల్లా రాజోళి మండలం పెద్ద ధన్వాడ శివారులో ఇథనాల్ కంపెనీ ఏర్పాటు చేయొద్దని పోరాటం చేసిన ఘటనలో 12 మంది రైతులను పోలీసులు అరెస్టు చేశారు.
ఈనెల 4న జైలుకెళ్లిన వీరికి 14 రోజుల తర్వాత కండీషన్ బెయిల్ మంజూరైంది. రా జోళి పోలీస్ స్టేషన్లో ప్రతి సోమవారం హాజరుకావాలన్న షరతుపై జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది.