Tahasildar Rajani | కిలోన్నర బంగారు అభరణాలు, 21 ప్లాట్లు.. జమ్మికుంట తహసీల్దార్‌కు 12 కోట్ల అక్రమాస్తులు
ఆదాయానికి మించి అక్రమాస్తులు కూడట్టారన్న ఆరోపణలతో కరీంనగర్ జిల్లా జమ్మికుంట తహసీల్దార్ రజిని ఇంటిపై ఏసీబీ అధికారులు పంజా విసిరారు. హనుమకొండలోని కేఎల్ఎన్రెడ్డి కాలనీలో ఉన్న ఆమె నివాసంలో బుధవారం తెల్లవారుజాము నుంచి సోదాలు నిర్వహించారు.
- జమ్మికుంట ఎమ్మార్వో రజిని ఇంటిపై ఏసీబీ రైడ్స్
- బంధువుల ఇండ్లలోనూ ఏకకాలంలో సోదాలు
- అరెస్ట్, రిమాండ్‌కు తరలింపు: ఏసీబీ డీఎస్పీ
Tahasildar Rajani | సుబేదారి/ధర్మసాగర్, జమ్మికుంట, మార్చి 13: ఆదాయానికి మించి అక్రమాస్తులు కూడట్టారన్న ఆరోపణలతో కరీంనగర్ జిల్లా జమ్మికుంట తహసీల్దార్ రజిని ఇంటిపై ఏసీబీ అధికారులు పంజా విసిరారు. హనుమకొండలోని కేఎల్ఎన్రెడ్డి కాలనీలో ఉన్న ఆమె నివాసంలో బుధవారం తెల్లవారుజాము నుంచి సోదాలు నిర్వహించారు.
మరో ఐదు చోట్ల ఆమె సమీప బంధువుల ఇండ్లలోనూ ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. గతంలో రజిని పనిచేసిన ధర్మసాగర్లోనూ తనిఖీలు చేశారు. తనిఖీల్లో ఇంటి స్థలా లు, వ్యవసాయ భూముల డాక్యుమెంట్లు, బంగారు ఆభరణాలు, కొంత నగదు స్వా ధీనం చేసుకున్నారు. రూ.25 లక్షల బ్యాంకు బ్యాలెన్స్ గుర్తించి, బ్యాంకు అధికారులకు సమాచారమిచ్చి సీజ్ చేయించారు. రజనీ అక్రమ ఆస్తుల వివరాలను కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి మీడియాకు తెలిపారు.
ప్రభుత్వ విలువ రూ.3.12 కోట్లు కాగా, బహిరంగ మార్కెట్లో రూ.12 కోట్లుగా ప్రాథమిక విచారణలో తేలిందని వెల్లడించారు. ఇంకా దర్యాప్తు కొనసాగుతున్నదని తెలిపారు. ఇప్పటివరకు రూ.12 కోట్ల అక్రమ ఆస్తుల్లో రెండు అంతస్థుల భవనం, 21 ప్లాట్లు, ఏడు ఎకరాల వ్యవసాయ భూమి, 25 లక్షల బ్యాంకు బ్యాలెన్స్, కిలోన్నర బంగారు అభరణాలు, రెండు కార్లు, మూడు బైక్‌లు, లక్షన్నర నగదు ఉన్నాయని పేర్కొన్నారు. సోదాల అనంతరం రజినిని అరెస్ట్ చేసి, కరీంనగర్ ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆదేశాలతో ఆమెను రిమాండ్‌కు తరలించారు.
అనేక ఆరోపణలు
రజిని ఉమ్మడి వరంగల్ జిల్లాలోని శాయంపేట, హసన్‌పర్తి, ధర్మసాగర్, తదితర రెవెన్యూ మండలాల్లో పనిచేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఆగస్టులో బదిలీపై జమ్మికుంట తహసీల్దార్‌గా వచ్చారు. గతంలో పనిచేసిన పలు మండలాల్లో అవకతవకలు, ధర్మసాగర్ మండలంలో ఓ భూవివాదం, జమ్మికుంటలో కొన్ని వివాదస్పద నిర్ణయాలు.. తదితర అంశాలపై ఏసీబీకి ఫిర్యాదులు వెళ్లినట్టు తెలిసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

