హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని 25 జిల్లాల్లోని 26 ప్రభుత్వ మెడికల్ కాలేజీల దవాఖానల్లో 1,159 స్పెషలిస్ట్ వైద్యులకు కంపల్సరీ గవర్నమెంట్ సర్వీస్ (సీజీఎస్) కింద ఏడాది కాలానికి పోస్టింగ్ ఇస్తూ మంగళవారం డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) ఆదేశాలు జారీ చేసింది. దీంతో పీజీ వైద్య విద్య పూర్తి చేసిన వారు తప్పనిసరిగా ప్రభుత్వ దవాఖానల్లో ఏడాది పాటు పని చేయాల్సి ఉంటుంది. మెరిట్ ఆధారంగా రెండురోజులు కౌన్సెలింగ్ నిర్వహించి.. వారు కోరుకొన్న దవాఖానలో వై ద్యం చేసేలా అవకాశం కల్పిస్తారు. స్పెషలిస్ట్ వైద్యులు.. జనరల్ సర్జరీ, జనరల్ మె డిసిన్, ఆర్థో, గైనిక్, ఈఎన్టీ, అనస్థీషియా సహా 24 రకాల వైద్య సేవలను ప్రజలకు అందిస్తారు. ప్రజారోగ్యమే పరమావధిగా భావించిన తెలంగాణ ప్రభుత్వం, స్పెషలిస్ట్ వైద్యులకు దేశంలోనే ఎకడా లేని విధంగా నెలకు రూ. 92,575 ైస్టెఫెండ్గా చెల్లిస్తున్నది. వైద్య విద్యతోపాటు స్పెషాలిటీ వైద్య సేవలను మారుమూల ప్రాంతాలకు చేరువ చేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ జిల్లాకొక మె డికల్ కాలేజీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.