పీఎంజీఎస్‌వై కింద నిర్మాణం:లోక్‌సభలో మంత్రి సాధ్వి
హైదరాబాద్, డిసెంబర్ 14(నమస్తే తెలంగాణ): ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన (పీఎంజీఎస్‌వై) పథకం కింద తెలంగాణకు 14,320 కిలోమీటర్ల రోడ్లు మంజూరు కాగా, అందులో 11,342 కిలోమీటర్ల పనులు పూర్తయ్యాయని కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ సహాయమంత్రి సాధ్వి నిరంజన్ వెల్లడించారు. టీఆర్ఎస్ ఎంపీలు పసునూరి దయాకర్, వెంకటేశ్ నేతకాని, కవిత, రంజిత్‌రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు వేసిన ప్రశ్నలకు లోక్‌సభలో మంగళవారం మంత్రి సమాధానమిచ్చారు. రోడ్ల పనుల కోసం 2016-17 నుంచి ఇప్పటివరకు కేంద్రం వాటాగా తెలంగాణకు రూ.789.22 కోట్ల నిధులను విడుదలచేసినట్టు వెల్లడించారు. రాష్ట్ర వాటాతో కలిపి రూ.1,473.94 కోట్లు ఖర్చుచేసినట్టు వివరించారు.