హైదరాబాద్, జనవరి19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది హజ్ యాత్రకు 11,195 దరఖాస్తులు వచ్చినట్టు మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సెక్రటరీ సయ్యద్ ఒమర్ జలీల్ తెలిపారు. వచ్చే నెలలో డ్రా పద్ధతిలో ఎంపిక చేస్తామని వెల్లడించారు. హజ్ యాత్ర2024 ఏర్పాట్లు తదితర అంశాలపై శుక్రవారం సచివాలయంలో సెక్రటరీ జలీల్ సమీక్షించారు. డ్రా పద్ధతి ముగియగానే ప్రయాణ సంబంధిత ఏర్పాట్లు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. మే లేదా జూన్లో యాత్ర ఉండవచ్చని తెలిపారు. అందు కు తగ్గ ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. సమావేశంలో హజ్కమిటీ ఏఈవో షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.