హైదరాబాద్ : ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను హైదరాబాద్ లోని తన క్యాంపు కార్యాలయంలో తెలంగాణ ఎలక్ట్రిసిటీ సంస్థ 1104 యూనియన్ నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు మర్యాద పూర్వకంగా కలిశారు. మంత్రి నూతన కార్యవర్గ సభ్యులను అభినందించారు.
ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం విద్యుత్ రంగం పై అనుసరిస్తున్న వైఖరిపై యూనియన్ నాయకులతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ చర్చించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన విద్యుత్ సంస్కరణలు దేశానికి ఆదర్శంగా నిలిచాయన్నారు.
రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి, 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా తో పాటు ఉచితంగా రైతులకు అందిస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సెస్ పేరుతో విధిస్తున్న పన్నుల భారంపై చర్చించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లితుందన్నారు.
కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ అన్ని యూనియన్ లు పోరాటం చేయాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు బి.వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి సాయిబాబా, సహా య కార్యదర్శులు సీహెచ్ శంకర్, వరప్రసాద్, కార్యనిర్వాహక అధ్యక్షుడు సుధీర్, 1104 యూనియన్ నాయకులు పద్మా రెడ్డి, జనార్దన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.