మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 20, 2020 , 14:41:59

టెన్త్ పరీక్షలు వాయిదా వేయండి..హైకోర్టు ఆదేశం

టెన్త్ పరీక్షలు వాయిదా వేయండి..హైకోర్టు ఆదేశం

హైదరాబాద్‌: కరోనా వ్యాప్తి దృష్ట్యా పదో తరగతి పరీక్షలు వాయిదా వేయాలని హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. అయితే రేపు జరగాల్సిన పరీక్షను మాత్రం యదావిధిగా  నిర్వహించాలని హైకోర్టు సూచించింది.  ఈ నెల 23 నుంచి 30 వరకు జరగాల్సిన  అన్ని  పరీక్షలు రీషెడ్యూల్‌ చేయాలని ప్రభుత్వాన్ని  హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 30 నుంచి ఏప్రిల్‌ 6 వరకు జరగాల్సిన  అన్ని పరీక్షలపై పరిస్థితులను బట్టి తదుపరి నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. 

రాష్ట్రంలో పదోతరగతి పరీక్షలు గురువారం ప్రారంభమైన విషయం తెలిసిందే. కరోనా వైరస్‌ విజృంభిస్తోన్న  నేపథ్యంలో పరీక్షలు కొనసాగించడంపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైన నేపథ్యంలో..అత్యవసరంగా కోర్టు విచారణ చేటట్టింది. ఈ మేరకు కోర్టు తీర్పు వెలువరించింది. 


logo
>>>>>>