హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలు ఈ నెలాఖరులో విడుదలకానున్నాయి. ఈ నెల 29న లేదా 30న ఫలితాలు విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు. జవాబుపత్రాల మూల్యాంకనం ఈ నెల 13నే ముగిసింది. మార్కుల నమోదు సహా క్రోడీకరణ పనులు కూడా ఇప్పటికే పూర్తిచేశారు.