హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ) : పదోతరగతి ఫలితాలను ఈ నెల 30న విడుదల చేయనున్నట్టు రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం తెలిపారు. మంగళవారం ఉదయం 11 గంటలకు ఈ ఫలితాలను వెల్లడిస్తామని చెప్పారు. బుధవారం ఇంటర్బోర్డులో తనను కలిసిన విలేకరులతో ఈ విషయాన్ని పంచుకొన్నారు.