అచ్చంపేట, మే 27: నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో మక్క బస్తాల చోరీ స్థానికం గా కలకలం రేపింది. యార్డులో అమ్మడానికి పేద రైతు 107 సంచుల మక్క ధాన్యం తీసుకురాగా రాత్రికి రాత్రే మా యంకావడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బాధిత రైతు కథ నం ప్రకారం.. అచ్చంపేటకు చెందిన రైతు జితేందర్ స్థానిక వ్యవసాయ మా ర్కెట్‌యార్డుకు మక్కలు తీసుకొచ్చాడు. మంగళవారం మధ్యాహ్నం వరకు మా ర్కెట్లో బస్తాల వద్ద ఉన్న రైతు పని నిమిత్తం ఇంటికి వెళ్లాడు. బుధవారం మధ్యాహ్నం తిరిగి మార్కెట్ యార్డ్‌కు వచ్చి చూసేసరికి అక్కడ ఉన్న 107 మక్కల సంచులు కన్పించకుండా పోవడంతో రైతు కంగుతిన్నాడు. ఈ ఘటనపై బాధిత రైతు జితేందర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ మా ర్కెట్యార్డులోనే రైతుల ధాన్యానికి భద్రత లేకపోవడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.