హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): డీఎస్సీ-24లో 1,056 టీచర్ పోస్టుల భర్తీకి బ్రేక్‌పడింది. కోర్టు కేసుల కారణంగా ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో 10,006 మంది టీచర్లకే బుధవారం నియామక ఉత్తర్వులివ్వనున్నారు. డీఎస్సీలో 11,062 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీచేయగా, 1,056 పోస్టుల భర్తీ ప్రక్రియ నిలిచిపోయింది.
కొత్త టీచర్లకు బుధవారం ఎల్బీస్టేడియంలో సీఎం రేవంత్‌రెడ్డి నియామకపత్రాలు అందజేయనున్నారు. జాబితాలను జిల్లాలకు పంపించగా, డీఈవోలు నియామక ఉత్తర్వులను తయారుచేసి బుధవారం హైదరాబాద్‌కు తీసుకురానున్నారు. ఎల్బీస్టేడియంలో సీఎం కొందరికే నియామక పత్రాలివ్వనుండగా, మిగతా వారికి జిల్లాలవారీగా కౌంటర్లు ఏర్పాటు చేసి అధికారులే పత్రాలను అందజేయనున్నారు.