హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ) : స్వాతంత్య్ర సమరయోధుడు, రెవెన్యూ శాఖ మాజీ ఉద్యోగి ఏటుకూరి కృష్ణమూర్తి అరుదైన ఘనత సాధించారు. శతాధిక వృద్ధుడైన ఆయన త్వరలో 105వ వ సంతంలోకి అడుగుపెట్టబోతున్నారు. వందేండ్లకుపైగా జీవించి ఇప్పటికీ పెన్ష న్ అందుకుంటున్న ఏకైక తెలుగు వ్యక్తి గా నిలిచారు. ప్రస్తుతం కుమారుడితో కలిసి హైదరాబాద్‌లో నివసిస్తున్న కృష్ణమూర్తి గుంటూరు జిల్లా ఏటుకూరులో 1923 సెప్టెంబర్ 29న జన్మించారు. 1948లో కర్నూల్ జిల్లా ఆళ్లగడ్డలో నెలకు రూ.37 వేతనంతో రెవెన్యూ శాఖలో ఉద్యోగంలో చేరారు. 1978 లో రెవెన్యూ ఇన్స్పెక్టర్గా ఉద్యోగ విరమణ చేశారు. బ్రిటిష్ పాలనలో రాయల్ నేవీలో పనిచేస్తూ స్వాతంత్య్ర ఉద్యమాల్లో పాల్గొన్న ఆయన.. రాయల్ నేవీ తిరుగుబాటుకు మద్దతుగా నిరస న చేపట్టినందుకు లక్నో, లాహోర్ జైళ్ల లో 18 నెలలపాటు శిక్ష అనుభవించా రు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొ ని, గుంటూరు సబ్‌జైలులో 8 నెలలు జైలు జీవితం గడిపారు.
ఏపీ ఉద్యోగుల సంఘం గుంటూరు జిల్లా కార్యదర్శి గా పనిచేశారు. ఉద్యోగులకు కనీస వేతనాలు, నాటి ముఖ్యమంత్రి కాసు బ్ర హ్మానందరెడ్డి హయాంలో జరిగిన 106 రోజుల సమ్మెలో గుంటూరు జిల్లా ఉ ద్యోగులను ముందుండి నడిపించారు. ఆ సమయంలో జీతాల్లేక ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులకు నిత్యావసరా లు అందేలా ఏర్పాట్లు చేశారు. స్వాతం త్య్ర ఉద్యమ చరిత్రను భవిష్యత్ తరాలకు అందించేందుకు ఆయన స్వయం గా అనేక పుస్తకాలు రచించి, సొంత ఖర్చులతో వాటిని ప్రచురించారు. ఈ సేవలకు గుర్తింపుగా కేంద్రం కృష్ణమూర్తికి స్వాతంత్య్ర సమరయోధుల పెన్షన్ మంజూరు చేసింది. ఉద్యోగులకు, దేశానికి కృష్ణమూర్తి చేసిన సేవలను గుర్తుచేసుకుంటూ ఆఖిల భారత పెన్షనర్ల దినోత్సవం సందర్భంగా ఆయనకు అనేక మంది శుభాకాంక్షలు తెలిపారు. క మ్యూనిస్టు సీనియర్ నేతగా కృష్ణమూర్తి నేటికీ పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటున్నారు.