తెలకపల్లి/తిమ్మాజిపేట/తాడూరు, అక్టోబర్ 7: టీఆర్ఎస్(బీఆర్ఎస్) అధినేత, సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రంగప్రవేశం చేస్తున్న సందర్భంగా ఆసరా పింఛన్‌దారులు మద్దతుగా నిలిచారు. నాగర్‌కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలం పెద్దూరుకు చెందిన పలువురు రూ.లక్షా 1,116 బీఆర్ఎస్కు విరాళంగా అందజేశారు. ఎంపీపీ రవీంద్రనాథ్‌రెడ్డి, టీఆర్ఎస్(బీఆర్ఎస్) పార్టీ మండల అధ్యక్షుడు జోగు ప్రదీప్, సర్పంచ్ వేణుగోపాల్గౌడ్కు ఈ మొత్తాన్ని అందజేశారు.