ఆదిలాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై యువత పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్లో చేరుతున్నారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని రాంనగర్‌కు చెందిన 100 మంది యువకులు జోగు రామన్న సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.
వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..ప్రభుత్వం యువతకు ఉపాధి కల్పించడానికి చర్యలు తీసుకుం టుందన్నారు.
ఇందులో భాగంగా వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 80,000 ఉద్యోగాలను ముఖ్యమంత్రి కేసీఆర్ భర్తీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఐటీ, ఇతర పరిశ్రమల్లో సైతం యువతకు భారీగా ఉద్యోగాలు లభిస్తున్నాయని పేర్కొన్నారు.
నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడానికి స్టడీ సర్కిల్లో ద్వారా ఉచితంగా శిక్షణ ఇస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి సరైన గుర్తింపు లభిస్తుందని, ప్రభుత్వ పథకాలను కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.