హైదరాబాద్, మే11 (నమస్తే తెలంగాణ): ఎస్సెస్సీ ఫలితాల్లో తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ పరిధిలోని 89 గురుకుల పాఠశాలలు 100శాతం ఉత్తీర్ణతను సాధించాయని అధికారులు తెలిపారు.
మొత్తం 204 గురుకుల పాఠశాలలు ఉండగా కేవలం 89 స్కూళ్లలోనే 100శాతం ఉత్తీర్ణత నమోదు కావడం గమనార్హం. ఇంటర్ ఫలితాల్లో 26 మైనార్టీ గురుకుల కాలేజీల్లోనే 100శాతం ఉత్తీర్ణత నమోదైంది.