హైదరాబాద్, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): కొండగట్టు ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించేందుకు కృషిచేసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, డాక్టర్ సంజయ్‌కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. శనివారం హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా కవితకు కొండగట్టు పూజారులు వేదాశీర్వచనాలు అందజేశారు. ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయించినందుకు సీఎం కేసీఆర్‌కు సుంకె రవిశంకర్ ధన్యవాదాలు తెలిపారు. త్వరలో కొండగట్టు ఆలయం అభివృద్ధి పనులు ప్రారంభమవుతాయని చెప్పారు.