దళితబంధుకు 250 కోట్లు

- 4 జిల్లాల్లోని 4 మండలాలకు నిధులు
- ఆయా జిల్లాల కలెక్టర్ల ఖాతాల్లో జమ
- భట్టి నియోజకవర్గంలోని చింతకాని మండలానికి 100 కోట్లు
- మార్చికల్లా ప్రతి నియోజవర్గానికి వంద మంది చొప్పున ఎంపిక
- వచ్చే బడ్జెట్లో 20 నుంచి 25 వేల కోట్లు కేటాయించే అవకాశం
హైదరాబాద్, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ): దళితబంధు పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం మరో రూ.250 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులను దళితబంధును ప్రయోగాత్మకంగా అమలుచేయనున్న నాలుగు జిల్లాల్లోని నాలుగు మండలాలకు కేటాయించారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలానికి రూ.100 కోట్లు, సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి మండలానికి రూ.50 కోట్లు, నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని చారగొండ మండలానికి రూ. 50 కోట్లు, కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని నిజాంసాగర్ మండలానికి రూ. 50 కోట్లు విడుదల చేశారు. ఈ నిధులను ఆయా జిల్లా కలెక్టర్ల ఖాతాల్లో జమ చేసేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ ఎండీ కరుణాకర్ ఉత్తర్వులు జారీచేశారు. ఇందులో చింతకాని మండలం శాసనసభలో కాంగ్రెస్‌పక్ష నేత మల్లు భట్టివిక్రమార్క ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం పరిధిలో ఉండటం విశేషం. ఇప్పటికే యాదాద్రి భువనగిరి జిల్లా వాసాలమర్రి గ్రామంలోని ఒక్కొక్క దళిత కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున రూ.7.6 కోట్లు విడుదల చేయగా, లబ్ధిదారులు స్వయం ఉపాధి యూనిట్లు ఎంపిక చేసుకొనే పనిలో నిమగ్నమయ్యారు. ఈ పథకాన్ని ప్రయోగాత్మకంగా చేపట్టిన హుజూరాబాద్ నియోజకవర్గానికి రూ.2 వేల కోట్లు విడుదల చేయగా, పలువురు దళితబిడ్డలు స్వయంశక్తితో పనులు చేసుకొంటూ, ఆత్మగౌరవంతో జీవిస్తున్నారు. ఈ రెండు ప్రాంతాల్లో మంచి ఫలితాలు రావడంతో గతంలో ప్రకటించిన విధంగా నాలుగు జిల్లాల్లోని నాలుగు మండలాలకు కూడా వెంటనే నిధులు విడుదలచేయాలని సీఎం కేసీఆర్ ఇటీవల అధికారులను ఆదేశించారు. దీంతో మంగళవారం నిధులు విడుదలయ్యాయి. ఈ పథకాన్ని మార్చి 2022 నాటికి రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు విస్తరించనున్నారు. ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ఏడాదికి వంద మంది చొప్పున లబ్ధిదారులను ఎంపికచేయనున్నారు. దళితబంధు పథకం అమలు కోసం రానున్న బడ్జెట్లో రూ.20 వేల కోట్ల నుంచి రూ.25 వేల కోట్ల వరకు కేటాయించనున్నారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
IND vs WI | బౌలర్లకు మరో సవాల్.. పొట్టి సిరీస్‌లో నేడు కీలక మ్యాచ్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

