కుమ్రం భీం ఆసిఫాబాద్ : గంజాయి సాగు చేస్తున్న(Cannabis cultivates) కేసులో నిందితుడికి 10 సంవత్స రాల జైలు శిక్ష(Imprisonment), రెండు లక్ష రూపాయల జరిమానా విధిస్తూ అసిఫాబాద్ జిల్లా సెషన్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి ఎంవీ రమేష్ తీర్పు ఇచ్చారు. జైనూర్ సీఐ అంజయ్య తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం చింతకర్ర గ్రామంలోని కిషన్ నాయక్ తండాకి చెందిన జాదవ్ తిరుపతి అనే వ్యక్తి తన వ్యవసాయ క్షేత్రంలో గంజాయిని సాగు చేస్తున్నాడు.
సమాచారం అందుకున్న పోలీసులు తేదీ: 02.10.2021 న జైనూర్ ఎస్ఐ తిరుపతి ఆధ్వర్యంలో తనిఖీ చేయగా సుమారు 200 గంజాయి మొక్కలు లభ్యమయ్యాయి. అతనిపై ఎన్డీపీస్ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. పీపీ జగన్మోహన్రావు సాక్షులను విచారించగా నేరం చేసినట్టు రుజువు కావడంతో నిందితుడుకి జైలు శిక్షతో పాటు రెండు లక్ష రూపాయల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.