పదేండ్ల బాలిక దారుణ హత్య.. పట్టపగలే ఇంట్లో చొరబడి దుండగుల ఘాతుకం
పదేండ్ల బాలికను గుర్తుతెలియని దుండగులు కత్తులతో పొడిచి హత్యచేశారు. ఈ ఘటన కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించిన ఈ ఘటనపై పోలీసులు, బాధిత కుటుంబసభ్యులు తెలిపిన వివరాల మేరకు..
- కూకట్పల్లి సంగీత్‌నగర్‌లో తీవ్ర కలకలం
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ) : పదేండ్ల బాలికను గుర్తుతెలియని దుండగులు కత్తులతో పొడిచి హత్యచేశారు. ఈ ఘటన కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించిన ఈ ఘటనపై పోలీసులు, బాధిత కుటుంబసభ్యులు తెలిపిన వివరాల మేరకు.. సంగారెడ్డి జిల్లా ముక్తా క్యాసారం, మునిపల్లి మండలానికి చెందిన రేణుక, కృష్ణ దంపతులకు కూతురు (10), కొడుకు (8) ఉన్నారు. ఉపాధి కోసం వారి కుటుంబం మూడేండ్ల కింద నగరానికి వచ్చి కూకట్‌పల్లిలోని సంగీత్‌నగర్‌లోని ఓ అపార్ట్మెంట్ పెంట్‌హౌస్‌లో నివాసం ఉంటున్నది. రేణుక స్థానిక ప్రైవేట్ దవాఖానలో ల్యాబ్ టెక్నీషియన్‌గా, కృష్ణ బైక్ మెకానిక్‌గా పని చేస్తున్నారు.
కూతురు బోయినపల్లి కేంద్రీయ విద్యాలయంలో 6వ తరగతి, కొడుకు స్థానిక ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు. వర్షం కారణంగా సోమవారం కేంద్రీయ విద్యాలయానికి సెలవు కావడంతో బాలిక ఇంటి వద్దనే ఉన్నది. కొడుకును ఉదయం 9 గంటలకు స్కూల్‌కు పంపిన దంపతులు తమ విధులకు వెళ్లారు. టిఫిన్ బాక్స్ తేలేదని కొడుకు స్కూల్ నుంచి కృష్ణకు ఫోన్ వచ్చింది. దీంతో బాలిక తండ్రి మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో కుమారుడికి లాంచ్ బాక్స్ తీసుకేళ్లేందుకు ఇంటికి వచ్చాడు. ఇంటి తలుపులు తెరిచేసరికి బెడ్రూమ్లో బాలిక రక్తపు మడుగులో పడి ఉన్నది. కడుపు, ఛాతిపై కత్తిపోట్లతో విగతజీవిగా ఉండటాన్ని చూసి తండ్రి గుండెలు బాదుకున్నాడు. పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు చేరుకొని దర్యాప్తు చేపట్టారు.
పలు కోణాల్లో దర్యాప్తు
బాలిక హత్యపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాలికపై దుండగులు లైంగికదాడికి యత్నించారా? లేక దొంగతనానికి వచ్చి, హత్య చేశారా? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. తెలిసిన వారెవరైనా ఈ ఘాతుకానికి పాల్పడ్డారా? లేక రక్త సంబంధీకుల హస్తం ఉన్నదా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఘటన ప్రాంతంలో సీసీ కెమెరాలు లేకపోవడంతో దుండగులను గుర్తించడం సవాల్‌గా మారింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police | దీప్కేకు అతడి నానమ్మ మరణవార్తను వెంటనే తెలియజేశాం : ఢిల్లీ పోలీసులు
BRS Councilors | మున్సిపల్ కమిషనర్ తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం : బీఆర్ఎస్ కౌన్సిలర్స్
Watch: పార్టీ సమావేశంలో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ.. పూలగుత్తులు, బూట్లు విసురుకున్న వైనం
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

